సీఎం రిలీఫ్ ఫండ్ తో చిన్నారికి ప్రాణాధారం

సీఎం రిలీఫ్ ఫండ్ తో చిన్నారికి ప్రాణాధారం

మోకాలి శస్త్రచికిత్సకు రూ.82,669 ఎల్ఓసీ అందజేత….
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ…

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట ఎన్టీఆర్ కాలనీకి చెందిన 7 ఏళ్ల బాలుడు ఒర్సు నిరంజన్ మోకాలి ఇన్ఫెక్షన్‌తో తీవ్రంగా బాధపడుతున్న నేపథ్యంలో, అతని శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.82,669 విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు శుక్రవారం పట్టణంలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శస్త్రచికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి ప్రభుత్వం అందించిన ఈ సహాయం పెద్ద ఊరటగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన ఆర్థిక సహాయానికి లబ్ధిదారుని తాతయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సహాయాన్ని అందించడంలో కృషి చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొలికపోగు చంటి, రాజవరపు శ్రీనివాసరావు, విస్సన్నపేట పట్టణ ఐటీడీపీ అధ్యక్షుడు మేశపం నవీన్, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply