బీహార్ ప్రజలకు పొంగులేటి పిలుపు..

బీహార్ ప్రజలకు పొంగులేటి పిలుపు..
రెండు దశాబ్దాల పాటు అవినితి అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బీహార్ రాష్ట్రంలో కుంటుపడిందని, బీహార్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్టీయే కూటమికి ఓటమి భయం పట్టుకుందని.. అందువలనే సాధ్యం కాని హామీలు ఇస్తుందని విమర్శించారు. వారి ఎన్నికల ప్రణాళికలో కోటి వరాలు ప్రకటించడం.. యువతకు కోటి ఉద్యోగాలు హామీలు ఇచ్చారన్నారు. అధికారంలో ఉన్న ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. మహాఘట్ బందన్ ను గెలిపిస్తే.. యువకుడైన తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
