పేదింటి ఆడబిడ్డలకు వరం…
కడం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం లాంటిదని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్(Vedama Bojju Patel) అన్నారు. ఈ రోజు కడెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రభుత్వం నుండి కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Lakshmi Scheme) షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు మంజూరైన నిధుల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పై లబ్ధిదారులకు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ నిధుల చెక్కులను మహిళా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Praja Govt) అర్హులైన కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, కడం మండల తహసిల్దార్ ఆర్ ప్రభాకర్, ఇన్చార్జి ఎంపీడీఓ రమేష్ రెడ్డి, ఐకెపి ఎ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పి సతీష్ రెడ్డి, ఖానాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ డి రాజశేఖర, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ మండల నాయకులు తరి శంకర్ షేక్, రఫీక్, బబ్లు, వాజిద్ ఖాన్, కే లక్ష్మణ్, ముసుకు రాజేందర్ రెడ్డి, బొడ్డు గంగన్న, టి రమేష్, ఆకుల లచ్చన్న, తక్కల సత్తన్న, పి. రాజు గోపాల్, వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

