Hero Nikhil | స్వయంభు వచ్చేది ఎప్పుడు..?

Hero Nikhil | స్వయంభు వచ్చేది ఎప్పుడు..?

Hero Nikhil | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హీరో (Hero) నిఖిల్ ఒకప్పుడు చాలా స్పీడుగా సినిమాలు చేశాడు. కానీ.. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. స్వయంభు అనే సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఇటీవల స్వయంభు రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించారు. అసలు స్వయంభు ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి..? చాలా గ్యాప్ తర్వాత వస్తున్న స్వయంభుతో నిఖిల్ సక్సెస్ సాధించేనా..?

Hero Nikhil | పీరియాడికల్ మూవీ..

నిఖిల్ హ్యాపీడేస్, యువత, స్వామి రారా, కార్తికేయ చిత్రాలతో.. సక్సెస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఈమధ్య కాలంలో కార్తికేయ 2 మాత్రమే నిఖిల్ (Nikhil) కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం, 18 పేజీస్, స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో స్వయంభూ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. పూర్తి పీరియాడికల్ మైథలాజికల్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది.

Hero Nikhil

Hero Nikhil | డిలే కి కారణం ఇదే..

ఈ మూవీ కోసం నిఖిల్ చాలా హామ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అయితే.. స్వయంభు రిలీజ్‌ విషయంలో డిలే జరుగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువుగా ఉండడం.. బిజినెస్‌, ఓటీటీ డీల్స్ డిలే కావడం వలనే రిలీజ్ ఆలస్యం అయ్యింది అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. ఈ మూవీ (Movie) ఈ మూవీలోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉంటాయట. అలాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ లో నిఖిల్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. కే.కే. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Hero Nikhil

Hero Nikhil | ఫిబ్రవరి 13న స్వయంభు..

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటీవల ఈ సినిమాని ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎప్పుడో రిలీజ్ (Release) కావాల్సిన సినిమా ఆలస్యం అవ్వడం.. పైగా ఎగ్జామ్స్ టైమ్ వలన స్టూడెంట్స్ ప్రిపరేషన్ మూడ్ లో ఉండే ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయడం అంటే రిస్కే అనే మాట వినిపిస్తుంది. మేకర్స్ మాత్రం సక్సెస్ పై నమ్మకంతో ఉన్నామంటున్నారు. మరి.. సరైన సక్సెస్ కోసం గత కొంతకాలంగా వెయిట్ చేస్తోన్న నిఖిల్ స్వయంభుతో బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

Hero Nikhil

CLICK HERE TO READ అనిల్ మరోసారి మ్యాజిక్ చేశాడా…?

CLICK HERE TO READ MORE

Leave a Reply