MLA | స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో..

MLA | స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో..

  • ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలి
  • గుడివాడ అభివృద్ధికి అందరం కలిసి ముందుకు సాగుదాం..
  • ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
  • ఎన్జీవోస్ అసోసియేషన్ 2026క్యాలెండర్ ఆవిష్కర‌ణ‌

MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌ దిశగా సాగుతున్న రాష్ట్రానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు అండగా నిలవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ అభివృద్ధి కోసం అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామన్నారు.

ఎన్జీవో అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే సోమవారం ఉదయం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్జీవో నేతలతో కొద్దిసేపు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడివాడలో అభివృద్ధి పనుల పై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఎమ్మెల్యేతో ఉద్యోగులు అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానని, ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మంచి కోసం ఉద్యోగ వర్గాలు చేసే అన్ని కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉద్యోగులతో అన్నారు.

పిచ్చోడి చేతిలో రాయిలా మారిన ఐదేళ్ల వైసీపీ పాలనకు స్వస్తి చెప్పి కూటమి పార్టీలకు పట్టం కట్టడంతో కీలక భూమిక పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం రుణపడి ఉంటుందన్నారు. అయితే ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు జరిగిన పొరపాటు సరిదిద్దు కున్నారన్నారు.

పరిపాలన అనుభవం, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ప్రజలకు ఎంత మంచి చేయొచ్చో చంద్రబాబు 19 నెలల కాలంలో ప్రత్యక్షంగా చూపించారన్నారు. కూటమిలో భాగస్వామైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సహకారం, దేశప్రధాని నరేంద్రమోడి తోడ్పాటుతో రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే పునరుద్ఘటించారు.

ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ అసోసియేషన్ గుడివాడ అధ్యక్షులు కేపీ రావు, ప్రధాన కార్యదర్శి జి.రాజేంద్రప్రసాద్, అసోసియేషన్ నాయకులు పీవీఆర్‌వీ ప్రసాద్, బీవై విష్ణు ప్రసాద్, ఎం. విద్యావతి, కే. మహేష్, ఎంవీ శ్రీనివాస్, డి.జ్వాలా కిరణ్, డి.విక్టర్ బాబు, పాపయ్య, వెంకటాద్రి, మనోజ్, రాము, రమేష్ బాబు, కొండలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, పలువురు ఎన్జీవో నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply