Vijayawada | వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు

Vijayawada | వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు
- ఎంపీ కేశినేని శివనాథ్
Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహావీరుడని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. బ్రిటీషు పాలకులకు ఎదురొడ్డి పోరాడిన వడ్డె ఓబన్న పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆదివారం విజయవాడ నగర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డె ఓబన్న జయంతోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని, వచ్చే ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో భారీ స్థాయిలో జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
