Schemes | అందుతున్నాయా..?

Schemes | అందుతున్నాయా..?
- మంథని ప్రజలను ఆత్మీయంగా పలకరించిన మంత్రి శ్రీధర్ బాబు
Schemes | మంథని, ఆంధ్రప్రభ : నిత్యం దైనందిన కార్యక్రమంలో బిజీబిజీగా ఉండే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ఆయన మంథనిలో పర్యటించారు. అక్కడి ప్రజలందరినీ కలుసుకుంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకెళ్లారు. ప్రజలు సమస్యల గురించి చెబుతుంటే ఓపికగా విని కొన్ని అక్కడికక్కడే పరిష్కరించారు. మంత్రి శ్రీధర్ బాబు తనదైన పరిపాలనతో మంథనిలో విశిష్టమైన ముద్ర వేసుకున్నారు. ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా ఆయన ముచ్చటించారు.
