Likha Gift : పోలీసులకు లిఖిత వరం Andhra Prabha News

Likha Gift : పోలీసులకు లిఖిత వరం Andhra Prabha News
13 బొలెరో వాహనాలు బహుకరణ
కృష్ణా పోలీసులు ధన్యవాదాలు
( ఆంధ్రప్రభ, మచిలీపట్నం)

Likha Gift : కృష్ణాజిల్లా పోలీస్ శాఖకు CSR FUND లో 9 నూతన బొలెరో వాహనాలను లిఖిత ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బహూకరించింది. పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగు పరుచుకోవడానికి నూతన వాహనాలు అందించిన లిఖిత ఇన్ఫ్రా సంస్థకు కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరపున ఏలూరు రేంజ్ ఐజిపి అశోక్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు.

Likha Gift : కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు వాహనాల అవసరతను గుర్తించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 9 నూతన బొలెరో వాహనాలను ఏలూరు రేంజ్ IGP జి.వి.జి అశోక్ కుమార్, కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ , పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తో కలిసి జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

Likha Gift : కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు మొత్తం 13 వాహనాలను సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా అందజేశారు. వీటిలో అవనిగడ్డ సబ్ డివిజన్ కు నాలుగు వాహనాలను గతంలో అందజేయగా, మిగిలిన 9 వాహనాలను ఈరోజు అందజేశారు, ఇప్పటివరకు కృష్ణాజిల్లా పోలీస్ శాఖకు మొత్తం 13 వాహనాలను అందజేసిన దాత లికిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీనివాసరావును సత్కరించి, కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Likha Gift : IGP అశోక్ కుమార్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికతో కూడిన వాహనాలు పోలీస్ శాఖకు ఎంతో అవసరమని, పోలీస్ శాఖ అవసరాన్ని గుర్తించి దాతలు ముందుకు వచ్చి చేసిన సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ వాహనాలన్నిటిని అవనిగడ్డ సబ్ డివిజన్ లోని పలు పోలీస్ స్టేషన్లకు, పెడన రూరల్ ps కేటాయిస్తామన్నారు. ఈ వాహనాలకు పోలీస్ శాఖ వెచ్చించే ఆదాయాన్ని పోలీస్ సిబ్బంది సంక్షేమానికి వినియోగించుకునే వీలు కలుగుతుందని తెలిపారు. తద్వారా సిబ్బంది అవసరాలను తీర్చడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.

Likha Gift : శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ప్రజా రక్షణకు , నిరంతరం విధులు నిర్వహిస్తు, ప్రజలను సురక్షితంగా ఉంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న కృష్ణాజిల్లా పోలీస్ శాఖకు నూతన వాహనాలను అందజేసి పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి అధునాతన వాహనాలు ఎంతో అవసరమని, ఈ కొత్త వాహనాలు వారి విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతుందని తెలియజేసారు

ALSO READ : AP CM with Farmer మోసం లేదు Andhra Prabha Live News
