5th day | ఉద్యోగుల ధర్నా

5th day | నాగాయలంక, ఆంధ్రప్రభ : సహకార సంఘాలలో పనిచేసే సిబ్బందికి జీవో నంబ‌ర్ 36 అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2019 నుంచి 2024 వరకు పీఆర్‌సీలను వెంటనే ఇప్పించాలని కోరుతూ ఐదో రోజు శుక్రవారం స్థానిక కేడీసీసీ బాంక్ కార్యాలయం ఎదుట నాగాయలంక, బర్రంకుల,పెదకమ్మవారి పాలెం,ఎదురుమొండి, పర్రచివర, ఏటిమొగ సంఘాల ఉద్యోగులు ధర్నా చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల్లా వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తరువాత సహకార సంఘాలలో జాయిన్ అయిన ప్రతి ఉద్యోగిని పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి కేవీ.రామాంజనేయులు, పి.శ్రీనివాసరావు, జీవీ భాస్కరరావు, కె.రాజేష్, కె.ఆనంద బాబు నేతృత్వం వహించారు.

Leave a Reply