ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఆసీస్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌లో.. టీమిండియా 100 పరుగులు చేసింది. ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టీమిండియా ముందు 265 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ క్రమంలో ఛేజింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా.. కంగారూలను ధీటుగా ఎదుర్కొంటూ.. 19.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (31) – శ్రేయాస్ అయ్యర్ (31) ఉన్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 20 ఓవర్లకు 76 బంతుల్లో 61 పరుగులు జోడించారు.