Telangana | క్రీడాల్లో పోటీపడాలి..

Telangana | క్రీడాల్లో పోటీపడాలి..
Telangana, కుంటాల, ఆంధ్రప్రభ : చదువుతో పాటు క్రీడాల్లో విద్యార్థులు పోటీపడాలని కోరుతూ ఎంపీడీవో అల్లాడి వనజ అన్నారు. మండల కేంద్రమైన కుంటాలలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడాల పట్ల యువకులకు ఆసక్తి పెంచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రధాన వీధుల్లో సీఎం కప్ ర్యాలీ చేపట్టి క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. క్రీడలతో మానసిక దృఢత్వం లభిస్తుందని ప్రతి ఒక్కరు క్రీడాలపై ఆసక్తి చూపాలని తెలియజేశారు.
అదేవిధంగా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. చదువు ఎంతో గొప్పదని.. చదువుతోనే భవిష్యత్తు లభిస్తుందని.. చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులకు చెప్పారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎంఏ అబ్దుల్ రహీం, మండల విద్యాధికారి ముత్యం ఏ పీ ఓ నవీన్, పంచాయతీ కార్యదర్శి రాజా బాపు, పీటీ వ్యాయామం ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
