Pollution Control | ముంపు గ్రామంగా ప్రకటించాలి…

Pollution Control | ముంపు గ్రామంగా ప్రకటించాలి…
Pollution Control | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ పెద్ద చెరువు రిజర్వాయర్ గా మారుతున్న నేపథ్యంలో ఊట్కూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలని పొల్యూషన్ కంట్రోల్(Pollution Control) బోర్డు ఈ ఈ సురేష్ కు బీజేవైఎం, బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు.
ప్రభుత్వం దామరగిద్ద తాండాలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో చెరువు సామర్థ్యం పెంచుతున్న అధికారులు నేటికీ డీ పీ ఆర్ ఇవ్వకపోవడంతో ప్రజలు, రైతులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. చెరువులో నీరు నిలువ ఉండడం వల్ల ఇళ్లల్లో నీరు వచ్చి దెబ్బ తినే పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి డిపిఆర్ విడుదల చేయడంతో పాటు ప్రజల అనుమానాలు నివృత్తి చేసి ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నవీన్ గౌడ్ తారా కృష్ణ, తిమ్మప్ప అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
