Minister | మార్లవాయి ప్రగతికి పచ్చ జెండా

Minister | మార్లవాయి ప్రగతికి పచ్చ జెండా

  • హామీని నిలబెట్టుకున్న ఇన్చార్జి మంత్రి

Minister | జైనూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు కృషి ఫలితంగా మార్లవాయి అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా పర్యటన చేసిన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంత్రిని మర్లవాయిని తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు. రాత్రి మంత్రి ఎమ్మెల్యే అధికారులతో కలిసి అక్కడే బసచేశారు.

ఉదయం జిల్లా ఇన్చార్జి మంత్రి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో సమావేశమై గ్రామ అభివృద్ధి వివరాల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వ హాయంలో నిర్లక్ష్యానికి గురైన మార్లవాయి దశను మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని విజ్ఞప్తి చేయడంతో.. సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.

స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మార్లవాయి అభివృద్ధికి రూ.91లక్షలు మంజూరు చేస్తూ జీఓ కాపీని మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ కు అందచేశారని ఎమ్మెల్యే తెలిపారు. వీటితో ప్రొఫెసర్ హైమాండ్ డార్ఫ్ బెట్టి ఎలజబేత్ ల కాంస్య విగ్రహాల ప్రతిష్టాపన, స్మృతివనంను ఏర్పాటు చేయనున్నారని, దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన చరిత్రాత్మక గ్రామం మార్గవాయికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కృషి మంత్రి జూపల్లి కృష్ణారావు చూపిన చొరవ సీఎం సహకారంతో మార్లవాయి ప్రగతి పథంలో దూసుకుపోనుంది. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసిన సందర్భంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రత్యేకంగా ఇవాళ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply