MLA | సమాఖ్య భవనానికి స్థలాన్ని కేటాయించండి

MLA | సమాఖ్య భవనానికి స్థలాన్ని కేటాయించండి

  • ఎమ్మెల్యేకు జనని మండల సమాఖ్య మహిళా సంఘం సభ్యుల వినతి

MLA | రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి నియోజకవర్గంలోని నూతన మండలం కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు జనని మండల సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మహిళల కోసం ఉచిత సౌకర్యం, బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్ ల ద్వారా ఆర్ధికంగా వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే జీఎస్ ఆర్ కొత్తపల్లిగోరి మండల తహసీల్దారు కు ఫోన్ చేసి మహిళా మండల సమాఖ్యకు అవసరమైన భూమి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వీ వో ఏల మండల సమాఖ్య సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీ వో ఏల మండల సమాఖ్య అధ్యక్షుడు సర్వు కుమారస్వామి, జనని మండల సమాఖ్య అధ్యక్షురాలు శోభ, సెక్రటరీ సుమలత, ట్రెజరరీ మమత, విజయ, స్వర్ణలత తదితరులు ఉన్నారు.

Leave a Reply