Warangal | ఉరుసు దర్గా సందర్శించిన ఎసీపీ శుభం ప్రకాష్

Warangal | ఉరుసు దర్గా సందర్శించిన ఎసీపీ శుభం ప్రకాష్
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ ఉర్స్ జాగీర్‌లోని హజ్రత్ మషూక్-ఎ-రబ్బానీ (రహ్) వారి దర్గా షరీఫ్‌ను ఏసిపి శుభం ప్రకాష్ ఐపీఎస్, ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఈనెల 11, 12 తేదీలలో జరిగే ఉరుసు ఏర్పాట్లను ఏసిపి శుభం ప్రకాష్(ACP Shubham Prakash) పరిశీలించి, భద్రతా, పరిపాలనా ఏర్పాట్లను గురించి పీఠాధిపతులు జనాబ్, నవీద్, బాబా సాహెబ్, ఉబైద్ బాబా సాహెబ్‌లతో చర్చలు నిర్వహించారు.
స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి పాల్గొని దర్గా ప్రాంతాన్ని పరిశీలించి నగరపాలక సంస్థ ద్వారా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మిల్స్ కాలనీ ఎస్ఐ సురేష్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. 40 డివిజన్లోని. ఉరుసు దర్గా గంధం ఉత్సవాలు ఈనెల 11 12, తేదీలలో అత్యంత వైభవంగా జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుండి ముస్లిం సోదరులు హజ్రత్ దర్గా ఉత్సవాలకు హాజరవుతారు.

