Champions Trophy | ట్రావీస్ హెడ్ ఔట్…వ‌రుణ్ కు వికెట్

ష‌మీ బౌలింగ్ లో కూప‌ర్ ఔట్
తొలి ఓవ‌ర్ లోనే ట్రావీస్ కు లైఫ్
ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేసిన‌ హెడ్
39 ప‌రుగుల‌కు హెడ్ పెవిలియ‌న్ కు
వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి తొలి ఓవ‌ర్ లోనే వికెట్

దుబాయ్ – చాంపియ‌న్స్ ట్రోఫీ సెమీస్ లో మ్యాచ్ లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది.. వరుణ్ చక్రవర్తి తొలి ఓవ‌ర్ లోనే ట్రావీస్ హెడ్ ను పెవిలియ‌న్ కు పంపించాడు. 39 పరుగులు చేసిన ట్రావీస్ హెడ్ వ‌ర‌ణ్ బౌలింగ్ లో గిల్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట‌య్యాడు..ఇక ఇండియాతో జ‌రుగుతున్న సెమీస్ మ్యాచ్ లో ఆదిలోనే ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ‌త‌గిలింది.. కూప‌ర్ సున్నా ప‌రుగుల‌కే ష‌మీ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. ఈ వికెట్ ష‌మీకి ల‌భించింది.. ఇక తొలి ఓవ‌ర్ లోనే ట్రావిస్ హెడ్ లైఫ్ ల‌భించింది. ష‌మీ త‌న బౌలింగ్ లోనే రిట‌ర్న్ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం స్మీత్ , ల‌బుసేన్ లు క్రీజ్ లో ఉన్నాడు. 11 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 65 ప‌రుగులు చేసింది ఆసీస్

అయిదుగురు స్పిన్న‌ర్ల‌తో ఆసీస్

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.. ఏకంగా అయిదుగురు స్పిన్న‌ర్ ల‌తో బ‌రిలోకి దిగింది. భార‌త్ కు ఎదుర్కొనేందుకు స్పిన్ తంత్రాన్ని ప్ర‌యోగించ‌నుంది. న‌లుగురు స్పిన్న‌ర‌ల‌తో బ‌రిలోకి దిగి న్యూజిల్యాండ్ పై విజ‌యం సాధించిన ఇండియా టీమ్ ను స్ఫూర్తిగా తీసుకున్న ఆసీస్ ఇప్పుడు అదే స్పిన్ తంత్రాన్ని మ‌న‌పై ప్ర‌యాగించేందుకు సిద్ద‌మైంది. జంపా, తన్వీర్, కూపర్, మ్యాక్స్వెల్ లో లబుషేన్ తో కూడా స్పిన్ బౌలింగ్ చేయించ‌నుంది.. మ‌న కంటే ఒక స్పిన్న‌ర్ ను అద‌నంగానే జ‌ట్టులోకి తీసుకుంది. ఇక టీమ్ ఇండియా జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు..

ఆసీస్ జ‌ట్టు – కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా

భార‌త్ జ‌ట్టు – రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *