Jannaram | నిషేధిత చైనా మాంజాను వాడితే చర్యలు

Jannaram | నిషేధిత చైనా మాంజాను వాడితే చర్యలు

  • స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్

Jannaram | జన్నారం, ఆంధ్రప్రభ : గాలిపటాల ఎగురవేతలో నిషేధిత చైనా మాంజాను వాడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కవ్వాల టైగర్ రిజర్వ్ జన్నారం ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ తెలిపారు. ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ… పర్యావరణానికి హాని కలిగించే చైనా మాంజా ద్వారాన్ని ప్రభుత్వం నిషేధించిందన్నారు. చైనా మాంజా దారాన్ని గాలిపటాల ఎగురవేతలో వినియోగించడంతో ధారం తగిలి, చుట్టుకొని పక్షులు, ప్రజలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు, వణ్య ప్రాణులకు తీవ్ర హాని కలిగించే చైనా మాంజా దారాన్ని తయారుచేసిన, విక్రయించి రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పక్షుల, ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసం సురక్షితమైన పత్తితో తయారు చేసిన దారాన్ని గాలిపటాల ఎగురవేత్తకు వినియోగించుకొని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply