Prabhas | రాజాసాబ్ క్లైమాక్స్.. వేరే లెవల్..

Prabhas | రాజాసాబ్ క్లైమాక్స్.. వేరే లెవల్..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి.. ఈ క్రేజీ కాంబో(Crazy combo)లో రూపొందిన భారీ హర్రర్ ఎంటర్ టైనర్ ది రాజాసాబ్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(Popular production company People Media Factory) ఈ సినిమాని నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ భారీ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ పై మరింత బజ్ పెరిగింది. అయితే.. తాజాగా థమన్ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఇంతకీ.. థమన్ ఏమని పోస్ట్ పెట్టారు..?

Prabhas | బాలీవుడ్ లో భారీ ప్రమోషన్స్..

Prabhas

ఈ భారీ చిత్రం నుంచి చివరి పాటను ముంబాయిలో సోమవారం రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అండ్ ట్రైలర్(Teaser and trailer) కు అనూహ్య స్పందన వచ్చింది. ఇంత వరకు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో రాజసాబ్ టీమ్ సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తెలుగులోనే ప్రమోషన్స్ చేసిన మేకర్స్ ఇక నుంచి బాలీవుడ్ లో కూడా భారీగా ప్రమోషన్స్(Massive promotions) చేయనున్నారు. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించడంతో ఆయనతో బాలీవుడ్ లో ఎక్కువగా ప్రమోషన్స్ ప్లాన్ చేసారని సమాచారం.

Prabhas | క్లైమాక్స్.. ఐమ్యాక్స్.. మారుతి మ్యాక్స్..

Prabhas

ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్(Sensational Music Director) ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి థమన్ సోషల్ మీడియాలో స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో ఒక క్రేజీ పోస్ట్‌ను షేర్ చేశారు. క్లైమాక్స్.. ఐమ్యాక్స్.. మారుతి మ్యాక్స్.. అంటూ పోస్ట్ పెట్టారు. థమన్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ ను బట్టి.. ఈ సినిమాలో క్లైమాక్స్ వేరే లెవల్లో(The climax is on a different level) ఉండబోతుందని తెలుస్తుంది.

Prabhas

డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్ మరో ఎత్తు అంటూ ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. దీనిని బట్టి రాజాసాబ్ క్లైమాక్స్(Rajasaab climax) అంచనాలకు మించి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

CLICK HERE TO READ రాజాసాబ్‌కు అన్యాయమా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply