అమరావతి: వీసీల రాజీనామా అంశంపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలపై నిగ్గుతేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేశ్.. స్పీకర్ ను కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో ‘బెదిరించినట్లు’ అనే పదం ఎక్కడా లేదని లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు.
వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. “రాజీనామా చేసిన ఒక వీసీ.. రాజారెడ్డి చెల్లెలి కోడలు. రాజీనామా చేసిన ప్రసాద్ రెడ్డి.. వైసీపీ కార్యకర్త. జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి” అని పేర్కొన్నారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీలదని లోకేశ్ వ్యాఖ్యానించారు.