Police | ప్రతీ ఒకరు హెల్మెట్ ధరించాలి : ఎస్ఐ

Police | ప్రతీ ఒకరు హెల్మెట్ ధరించాలి : ఎస్ఐ

Police | ఘంటసాల, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఘంటసాల ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఘంటసాల మండలం లంకపల్లి గ్రామం ప్రధాన జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులకు ఎస్ఐ ప్రతాప్ రెడ్డి ఆధ్యర్యంలో హెల్మెట్ ధరించడంపై ఈ రోజు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని ఆపి హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… హెల్మెట్ లేనివారికి జరిమానా విధించడం జరుగుతుందనీ, లేని పక్షంలో దగ్గరలోని షాపులో హెల్మెట్ కొనుగోలు చేసి ధరిస్తే, జరిమానా విధించకుండా వదిలేస్తామన్నారు. ప్రాణ రక్షణకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply