MLA | కార్యకర్తలకు అండగా..

MLA | కార్యకర్తలకు అండగా..

  • ప్రమాద బీమా సౌకర్యం కుటుంబాల‌కు ఉపయోగకరం
  • ఎమ్మెల్యే బోడే ప్రసాద్

MLA | పెనమలూరు, ఆంధ్రప్రభ : ప్రమాద బీమా సౌకర్యం కుటుంబానికి ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. తాడిగడప గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త బండ్రపల్లి సుబ్బారావు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రమాద బీమా సౌకర్యంతో మృతుని భార్య కోటేశ్వరమ్మకు ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల నగదు ధ్రువీకరణ పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు గాయపడినా, మరణించినా ఆర్థిక తోడ్పాటు ఉండేలా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. దీని ద్వారా మరణించిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నామ‌న్నారు. వివిధ స్థాయిల్లో అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆర్థిక తోడ్పాటు ఇచ్చేలా అవకాశం ఉందన్నారు.

Leave a Reply