MLA | మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కండి

MLA | మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కండి
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపు
MLA | మక్తల్, ఆంధ్రప్రభ : త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త సన్నద్దం కావాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని తన నివాసంలో జరిగిన మక్తల్ మున్సిపల్ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతంలో కెసిఆర్ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లో చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనివిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అదేవిధంగా మక్తల్ మున్సిపాలిటీని తీసుకొచ్చిన చరిత్ర కూడా బిఆర్ఎస్ పార్టీదన్నారు.
ఆయా వార్డుల్లోని ప్రజలను చైతన్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 వాగ్దానాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రధానంగా రైతులకు, మహిళలకు, యువతకు, విద్యార్థులకు చేసిన మోసాలను ఓటర్ల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. ఆయా వార్డుల్లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లు ఉంటే సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన తెలియజేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే ప్రతి కార్యకర్త నడుచుకోవాలని మక్తల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేయాలని ఆదిశగా బిఆర్ఎస్ శ్రేణులు నేటి నుండి క్షేత్ర స్థాయిలో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్సింహ గౌడ్, పట్టణ అధ్యక్షుడు జుట్ల చిన్న హన్మంతు, నాయకులు పసుల విష్ణువర్ధన్ రెడ్డి,అన్వర్ హుస్సేన్, జగ్గలి రాములు, మొగులప్ప, చందాపూర్ అశోక్ గౌడ్ ,కుమ్మరి రవికుమార్,మన్నాన్ తదితరులు పాల్గొన్నారు.
