SUB Collector | విద్యార్థుల ప్రతిభను పరీక్షించిన సబ్ కలెక్టర్

SUB Collector | విద్యార్థుల ప్రతిభను పరీక్షించిన సబ్ కలెక్టర్

SUB Collector | మోస్రా, ఆంధ్రప్రభ : బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గోవూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి మధ్యంతర పరీక్షల రిపోర్ట్ ఆధారంగా 6వ తరగతి విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. వారి ప్రతిభ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయుల కార్యాచరణ ప్రణాళికను అభినందించారు.

SUB Collector

ఉపాధ్యాయులు సమయస్ఫూర్తి ఆధారంగా ఖచ్చితంగా భోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ప్రధానోపాధ్యాయులు డి.నాగనాథ్, పిఆర్టియు మోస్రా మండల అధ్యక్షులు యస్.రాములు, ఉపాధ్యాయ బృందం పాల్గొని అనంతరం సబ్ కలెక్టర్ ను సన్మానించారు.

Leave a Reply