CM |సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

CM | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఉపేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
