natural farming | ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభం

natural farming | ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభం

natural farming | దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అధిక లాభం(High profit) కలుగుతుందని మండలంలోని దండేపల్లి క్లస్టర్ ఏఈవో మౌనిక అన్నారు. ఇవాళ‌ దండేపల్లి గ్రామంలో (న్యాచురల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫామింగ్ పై ) రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయం(natural farming) చేయడం వలన సాగు ఖర్చు తగ్గడం, భూమి సారాన్ని పెంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం వలన రైతులు అధిక లాభాలు పొందవచ్చని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి తెలియజేయడం జరిగిందన్నారు. వ్యవసాయంలో వేప నూనె అవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతుసంఘం సభ్యులు, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply