Counting Day | న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం టీచ‌ర్ స్థానంలో పీఆర్‌టీయూ ముందంజ‌

హైద‌రాబాద్ – ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొన‌సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీ‌పాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మొత్తం 25,797 ఓట్లు ఉండగా 24,132 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు అందిన స‌మాచారం మేర‌కు పీఆర్‌టీయూ అభ్య‌ర్థి శ్రీ‌పాల్ రెడ్డికి 6035 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 4820 ఓట్లు, స్వ‌తంత్య్ర అభ‌ర్థి హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌కు 4437ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పూలరవీందర్ కు 3115 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డికి 2289 ఓట్లు ల‌భించాయి.

ముగిసిన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.

చెల్లుబాటు అయిన ఓట్లు 23, 641
చెల్లని ఓట్లు 494…
గెలుపు కోటా ఓట్లు 11,822 గా నిర్దారణ…
శ్రీపాల్ రెడ్డి -6035 …
అలుగుబెల్లి నర్సిరెడ్డి-4820..
హర్షవర్ధన్ రెడ్డి-4437..
పూల రవీందర్-3115…
పులి సరోత్తం రెడ్డి-2289…
2040 సుందర్ రాజు

భారీగా చెల్లని ఓట్లు!
క‌రీంన‌గ‌ర్, మెద‌క్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్ గ్రాడ్యూయేష‌న్ శాస‌న‌మండ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో చెల్ల‌ని ఓట్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ్యాలీడ్, ఇన్ వ్యాలీడ్ ఓట్లను సపరేట్ చేస్తున్నారు. పట్ట భద్రుల కౌంటింగ్ లో పెద్ద మొత్తంలో చల్లని ఓట్లు నమోదు అవుతుండడం గమనార్హం. ఈ ప్రభావం ఎవరి పై పడుతుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply