Rs. 50 thousand crores | 18 నెలల్లో రూ.50 వేల కోట్లు..

Rs. 50 thousand crores | 18 నెలల్లో రూ.50 వేల కోట్లు..
- కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి
- టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిశ కృష్ణమ్మ
Rs. 50 thousand crores | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం 18 నెలల వ్యవధిలోనే రూ.50 వేల కోట్ల(Rs. 50 thousand crores) మేర అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిశ కృష్ణమ్మ పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించి, నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) నాయకత్వంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమికి అపూర్వమైన మద్దతు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. జూన్ 13, 2024న అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలతో పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు, చైర్మన్లు వి.కమిసింగ్, వై.నాగేశ్వరరావు యాదవ్, కార్పొరేటర్లు పద్మలతారెడ్డి, కె. పరమేష్, డైరెక్టర్లు ఎస్. ముంతాజ్, నంద్యాల నాగేంద్ర, మన్పూడి, జేమ్స్, ప్రసాద్, కౌసిక్ తదితరులు పాల్గొన్నారు.
