Government school | వరి నాట్లు వేసిన విద్యార్థులు…
Government school | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ ప్రభుత్వ పాఠశాల(Government school) విద్యార్థులు మంగళవారం పంట పొలాలలో నాట్లు వేశారు. వరి పంట నాట్ల నుండి వరి కోత వరకు జరిగే ప్రక్రియను పాఠశాల విద్యార్థులకు అవగతం చేసేందుకు గాను ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోన్స్ తెలిపారు.
అలాగే సేంద్రీయ ఎరువుల(organic fertilizer) వాడకం పై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. రైతులు వరి పంట పొలాల్లో ఆచరించే పద్ధతులను పాఠశాల విద్యార్థులు తెలుసుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వరి పంట పొలాల వద్దకు తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. వారు నాట్లు వేయడం, నీటి వ్యవస్థ, పైరుకు సంక్రమించే రోగాలు, వరి పంట నూర్పిడి, ధాన్యం బియ్యంగా మార్చడం వరకు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.

