Adilabad | ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Adilabad | ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని రామాలయంతో పాటు సాలె వాడ (కే )లోని హర హర మహాదేవ శివుని ఆలయం(temple)లో ఈ రోజు ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయాలకు రావడంతో ఆలయం నిర్వాహకులు భక్తులు ఆలయంలో దర్శనానికి ప్రవేశం కోసం ఉత్తర దిశ నుండి ఆలయాల్లో ప్రవేశించడానికి ఏర్పాట్లు చేశారు.

ప్రజలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉపవాసాలు ఉండి మందిరాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నా రు. సాలెవాడా హర హర దేవ్ మందిరంలో జరిగిన వేడుకల్లో ఆదిలాబాద్(Adilabad) బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, మాజీ ఎంపీటీసీ సల్గిరి రవీందర్, సాలెవాడ( కె) నూతన సర్పంచ్ తులసి రామ్ చిక్రం, నాయకులు బాబా రావు, బిక్కు నాయక్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply