108 Ambulance | రోడ్డుప్రమాదంలో ఆర్టీవో ఏవోకు గాయాలు
- పరిస్థితి విషమం…
108 Ambulance | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న కేవీ కృష్ణారావు(K.V. Krishna Rao) ఇవాళ ఉప్పల్ రాజలక్ష్మి థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కృష్ణారావును స్థానికులు వెంటనే గుర్తించి 108 అంబులెన్స్(108 Ambulance) ద్వారా కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

