2026 new year celebrations | విదేశాల్లో వింతవింతగా…ఎక్కడెక్కడ..ఎలా…

2026 new year celebrations | విదేశాల్లో వింతవింతగా…ఎక్కడెక్కడ..ఎలా…
2026 new year celebrations | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకలు (new year celebrations) మీరు ఎలా జరుపుకోబోతున్నారూ? ఎప్పట్లానే…ప్రతి ఏడాదీ ఎలా జరుపుకుంటున్నామో అలాగే…అంటారా…. మందూ…విందూ…చిందూ..మస్తుమస్తు ఎంజాయ్ మెంట్ తో కేరింతలతో ఆకాశాన్నంటే సంబరాలతో..అంటారా?
ఆగండాగండి…అలా అందరూ జరుపుకుంటారు… కాస్త వెరైటీగా ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వెరైటీగా ఎక్కడెక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మీరు ఇది చదవాల్సిందే…ఇవన్నీ మనకు వింత అయినా…అక్కడి ఆచారాలివేనట…పైగా ఇలా చేస్తేనే ఏడాదంతా సంతోషంగా గడుస్తుందని నమ్మకం కూడానట. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటున్నారా? అవును వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ (Very very interesting)… ఒక్కోచోట ఒక్కోలా…న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా విభిన్నంగా..మనకిక్కడ విభిన్నంగా అనిపించవచ్చుగానీ, ప్రతి దేశం తన సంస్కృతి, నమ్మకాలకు అనుగుణంగా వింతైన, సరదా ఆచారాలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంది.

ప్రపంచం (world) లో మొదటిగా న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యేది ఆస్ట్రేలియా(సిడ్నీ)లో. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్, ఒపెరా హౌస్ చుట్టూ అద్భుతమైన బాణాసంచా ప్రదర్శన జరుగుతుంది. లక్షలాది మంది చూస్తారు. బంధుమిత్ర పరివారమంతా అక్కడ కలుసుకోవడానికీ, విషెస్ చెప్పుకోవడానికీ చాలా ప్రాముఖ్యతనిస్తారు.

అమెరికా (America) (న్యూయార్క్)లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రసిద్ధ బాల్ డ్రాప్ ఆచారం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ అర్ధరాత్రి ఒక పెద్ద బంతి కిందికి దిగుతుంది. లక్షల మంది సమావేశమవుతారు. ఫుడ్ డ్రింక్స్ తో ఫుల్ల్ గా ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతారు.

బ్రెజిల్ (Brazil) లోని కోపకబనా బీచ్‌లో అందరూ తెల్లటి దుస్తులు ధరించి, ముందుగా సముద్ర దేవత ఇమంజాకు కృతజ్ఞతలు చెప్పి అలల మీద 7సార్లు దూకుతారట..ఇదేం దూకుడు అనుకోకండి. ఇది అక్కడి వారి ఆచారమంతే.. జంపింగ్ 7 వేవ్స్ ఆచారం అని దీనికి పేరట..ఇలా దూకితే ఏడాదంతా అందరికీ మంచి అదృష్టం కలుగుతుందని బ్రెజిల్ ప్రజల నమ్మకమట.

స్పెయిన్ (Spain) లో 31 డిసెంబర్ దాటి జనవరి 1లోకి ప్రవేశించే అర్ధరాత్రి గడియారం 12 సార్లు మోగినప్పుడు 12 ద్రాక్షపండ్లు తినడం వారి ఆచారం…సెంటిమెంట్ అట. అలా ఎందుకంటారా? ప్రతి మోతకు ఒకటి చొప్పున తింటే ఏడాది మొత్తం అంటే 12 నెలలకు మంచి అదృష్టం తమను వరిస్తుందనేది వారి నమ్మకమట.

స్కాట్లాండ్ (Scotland) లోని హాగ్‌మనే పండుగలో ఫస్ట్ ఫూటింగ్ అని జరుపుకుంటారట 31 డిసెంబర్ అర్ధరాత్రి తర్వాత మొదటి అతిథి అదీ పొడవైన, నల్లటి జుట్టు ఉన్నవారు అయితే మరీ మంచిదట. వారు రావాలి, వస్తూ వస్తూ బొగ్గు, విస్కీ వంటివి తీసుకుని వచ్చి ఇంట్లో అడుగుపెడితే సంవత్సరం అంతా మంచి జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తారట.

ఇది మరీ వినడానికి వింతగా ఉన్న ఆచారం…డెన్మార్క్ (Denmark) లో స్నేహితుల ఇళ్ల ముందు పాత ప్లేట్లు పగలగొట్టడం ఒక ఆచారం.. ఎన్ని ఎక్కువ ప్లేట్లు పగులుతే అంత అదృష్టం కలిసొస్తుందట. అదీ వారి నమ్మకం. అందుకే రెచ్చిపోయి, పాత ప్లేట్లన్నీ మోసుకెళ్ళి స్నేహితుల ఇళ్ళముందు పగలగొట్టి న్యూ ఇయర్ కి స్వాగతం చెప్తారట…అంటే మనం కుండబద్దలు కొట్టి నిజం చెప్పడం అంటాం కదా, అలాగన్నమాట. ఎన్ని ప్లేట్లు పగలగొడితే, స్నేహితులు అంత ఎక్కువ అని నమ్మకం. ప్లేట్లనుబట్టి స్నేహితుల సంఖ్య ఏమిటో మరి….

ఇవేకాక ప్రపంచవ్యాప్తంగా ఇంకొన్ని ఉన్నాయండోయ్…
ఇటలీ (Italy) లో ఆడా-మగా అందరూ రెడ్ అండర్‌వేర్ ధరించడం ప్రేమకు సంకేతంగా భావిస్తారట. కొలంబియాలో ఖాళీ సూట్‌కేస్‌తో వారు నివసించే బ్లాక్ చుట్టూ తిరగడం వారి ఆచారమట. ఎందుకంటే, మరి సురక్షిత ప్రయాణాలు చేయాలనో, ఇంకేదో…వారి ఆచారం…సెంటిమెంట్..వింతగా ఉంది కదూ…

ఇక జపాన్ (Japan) లో టెంపుల్ బెల్స్ అంటే మన గుడి గంటలు 108 సార్లు మోగిస్తారట… ఈ గంట నుంచి వెలువడే శబ్దానికి మనసులోని దురాలోచనలన్నీ దూరమై, కొత్త సంవత్సరమంతా పాజిటివ్ వేవ్స్ తో సంతోషంగా గడుస్తుందని వారి నమ్మకం…

ఇవండీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే న్యూ ఇయర్ వేడుకల్లో కొన్ని…ఇవి వింతగా అనిపించినా, విచిత్రంగా అనిపించినా, వారివారి ఆచారాలు, సెంటిమెంట్లు…అవి అక్కడి వారికి మాత్రమే సుమా… కొత్తగా అనిపించాయని, వెరైటీగా ఉన్నాయని మోజుపడి మీరూ ఇక్కడ ట్రై చేసేరు… మనం మనలాగే జరుపుకుందాం…చక్కగా ఎంజాయ్ చేసేద్దాం….సరేనా…. విష్ యూ హాప్పీ న్యూ ఇయర్ 2026 (Wish you a Happy New Year 2026).


