108 Ambulance | అత్యవసర వైద్య సేవలు అందించాలి
- జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నలుగూరి జనార్ధన్
108 Ambulance | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించే 108 అంబులెన్స్ ను 108కి సంబంధించిన ఉన్నతాధికారులు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమ్మడి నిజమాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ నలుగూరి జనార్ధన్ 108 వాహనాన్ని, రికార్డులను తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న మందులు, వైద్య పరికరాలు వాటి స్థితిగతులు కనుక్కున్నారు. వాటి నిల్వలు చూసి రికార్డులు పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ… ప్రమాదాలు జరిగిన అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించేందుకు సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించాలని, గర్భిణులను ప్రసవ సమయంలో ఆసుపత్రికి అంబులెన్స్ లోనే తరలించేలా క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు. వాహనాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందులోని వైద్య పరికరాలపని తీరును ప్రతి రోజు పర్యవేక్షించాలని, అలాగే రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు. వాహనాన్ని కండిషన్ లో ఉంచుకోవాలని, ఫైలెట్లు కేఎంపీఎల్ ను మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా కో ఆర్డినేటర్ బొండ్ల స్వరాజ్, 108 సిబ్బంది ఈఎంటి జగదీష్, పైలట్ శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.

