4800 years | అనంత శయనస్వామి ఆలయంలో…

4800 years | అనంత శయనస్వామి ఆలయంలో…

  • ప్రత్యేక ఉత్సవాలు

4800 years | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట పట్టణంలోని పరిమళాపురం (పళ్ల), డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పరిమళాపురంలో వెలసిన ప్రసిద్ధ అనంత శయన స్వామి ఆలయం(temple)లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

పట్టణంలో ఏకైక ఉత్తర ద్వారం కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు వారు తెలిపారు. సుమారు 4800 సంవత్సరాల(4800 years) క్రితం పాండవుల మనుమడు జనమేజయ రాజు ప్రతిష్ఠించిన ఈ ఆలయం నాటి నుంచీ నిరంతర పూజలతో ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.

ఉత్సవ వివరాలు ఈనెల 30న మంగళవారం ఉదయం 5.00 గంటలకు స్వామివారి మూలవిగ్రహానికి అభిషేకం, ఉదయం 5.30 గంటలకు పల్లకీ సేవతో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ప్రారంభం.. 31న బుధవారం ఉదయం 6.30 గంటలకు శ్రీ లక్ష్మి అనంత శయన కల్యాణం, అనంతరం ధనుర్మాస మహా నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) పవిత్ర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుని పరమపావనమైన కృపకు పాత్రులవ్వాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. రఘుప్రేమాచార్య జోషి, శ్రీపాద కులకర్ణి ఆహ్వానించారు.

Leave a Reply