Avanigadda MLA | విద్యతోనే పేదరిక నిర్మూలన

Avanigadda MLA | విద్యతోనే పేదరిక నిర్మూలన

  • చదువులో మర్మం గ్రహిస్తే ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణులవుతారు
  • టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
  • అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

Avanigadda MLA | చల్లపల్లి, ఆంధ్రప్రభ : చదువులో మర్మం గ్రహించే ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణులవుతారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతూ త్వరలో పబ్లిక్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు సిద్ధమ‌వుతున్న 800మంది టెన్త్ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ… పేదరిక నిర్మూలనకు విద్యతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలో పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది అత్యధికంగా 92శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, ఈ ఏడాది ప్రతి విద్యార్థి పాస్ కావాలన్న ధ్యేయంతో నియోజకవర్గంలోని టెన్త్ విద్యార్థులకు సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మన పేరు పాఠ్య పుస్తకాల్లో ఎక్కే స్థాయికి ఎదగాలనే ఆకాంక్షతో చదివితే క‌చ్చితంగా ప్రతి ఒక్కరూ ఉత్తమ ఫలితాలు అందుకుంటారని తెలిపారు.

జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ.సుబ్బారావు మాట్లాడుతూ.. ఈ ఏడాది కృష్ణాజిల్లా టెన్త్ ఫలితాల్లో స్టేట్ టాప్-5లో నిలిపే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సబ్జెక్టు నిపుణులు షాజా బేగం, కే.వాహిని, ఝాన్సీ లక్ష్మిభాయ్, టీ.శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, ఆర్.రత్నగిరి, యేసుపాదం, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు విద్యార్థులకు తమ సబ్జెక్ట్ వారీగా శిక్షణ ఇచ్చి సందేహాలు నివృత్తి చేశారు.

నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయరాధిక, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, ఉప సర్పంచ్ ముమ్మనేని రాజకుమార్ (నాని), ఎంఈఓలు జీ.ఎన్.బీ.గోపాల్, ఎన్.శివశంకర్, కందుల సుజాత, పీ.వెంకటేశ్వరరావు, మోమిన్, సనకా శ్రీకాంత్, ఆలా వెంకటరమణ, పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, విశ్రాంత హెచ్ఎం జీవీ తాతారావు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, పీఈటీలు, సీఆర్పీలు పాల్గొన్నారు.

Leave a Reply