pawan | prabhas | multistarrer | నిధి అగర్వాల్ క్రేజీ కాంబో సాధ్యమేనా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నిధి అగర్వాల్.. సవ్యసాచి సినిమాతో(With the movie Savyasachi) టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా సక్సెస్ సాధించకపోయినా.. అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈమధ్య ఈ అమ్మడు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్(Dream project) గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ.. నిధి ఏం చెప్పింది..?
pawan | prabhas | multistarrer | ఆ సినిమా పైనే నిధి ఆశలు..

నిధి అగర్వాల్(Nidhi Agarwal).. సవ్యసాచి సినిమా తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో, వీరమల్లు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జంటగా ది రాజాసాబ్ మూవీలో నటించింది. మారుతి తెరకెక్కించిన ఈ క్రేజీ మూవీ జనవరి 9న ప్రేక్షకుల(Audience on January 9th) ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఈ సినిమాని నిధి బాగా ప్రమోట్ చేస్తుంది. పవర్ స్టార్(Power Star) తో వీరమల్లు సినిమాలో నటించినా.. ఫలితం దక్కలేదు. దీంతో రాజాసాబ్ పై భారీగా ఆశలు పెట్టుకుంది.
pawan | prabhas | multistarrer | నిధి డ్రీమ్ అదిరింది..

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిధి అగర్వాల్ సోషల్(Nidhi Agarwal Social) మీడియాలో చాట్ సెషన్ నిర్వహించింది. ఇందులో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఇద్దరి కాంబోలో భారీ మల్టీస్టారర్ చేస్తే చూడాలనివుంది అని చెప్పింది. అంతే కాదండోయ్.. ఈ క్రేజీ కాంబోలో తనే హీరోయిన్ గా నటించాలని తన మనసులో మాటలను బయటపెట్టింది. అంతటి ఆగలేదు.. ఈ అమ్మడు. డైరెక్టర్ ఎవరు ఉండాలో కూడా చెప్పింది. ఎవరంటే.. సెన్సేషనల్ డైరెక్టర్(Sensational Director) సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని డైరెక్ట్ చేయాలని చెప్పింది. ఇలా మరోసారి వార్తల్లో నిలిచింది అందాల నిధి. అయితే.. నిధి డ్రీమ్ ప్రాజెక్ట్ వినడానికి బాగానే ఉంది. మరి.. జరుగుతుందో లేదో చూడాలి.

