PACP Chairman | భవిష్యత్ కు భరోసా..

PACP Chairman | భవిష్యత్ కు భరోసా..
PACP Chairman | మోపిదేవి, ఆంధ్రప్రభ : డిపాజిట్లతో భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుందని పీఎసీఎప్ ఛైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని మెరకనపల్లి గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ప్రత్యేక డిపాజిట్ల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిరువోలు గ్రామానికి చెందిన కర్రా సురేష్ డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా కర్రా సురేష్ చైర్మన్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతులకు చైర్మన్ సుబ్బారావు డిపాజిట్ ల పై అవగాహన కల్పించారు. పీఎసీఎస్ లలో ప్రతి ఒక్కరూ డిపాజిట్ చేసుకోవచ్చునని తెలిపారు. డిపాజిట్ల ద్వారా ప్రతి ఒక్కరికి భరోసా ఏర్పడుతుందన్నారు.
