Good news | మహిళా నిరుద్యోగులకు శుభవార్త

2025–26 Good news | మహిళా నిరుద్యోగులకు శుభవార్త

2025–26 Good news | కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రవ్యాప్తంగా 1,095 పోస్టులు భర్తీ
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ

2025–26 Good news | ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ నిరుద్యోగ మహిళలకు పెద్ద ఊరటగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాన్–టీచింగ్ పోస్టుల భర్తీకి 2025–26 సంవత్సరానికి గాను నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నియామకాలు పూర్తిస్థాయి అవుట్‌సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికన చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,095 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో టైప్ 3 కేజీబీవీల్లో 564 ఖాళీలు, టైప్ 4 కేజీబీవీల్లో 531 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థుల నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నారు.

2025–26 Good news |పోస్టును బట్టి అర్హతలు

నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించారు. జిల్లా స్థాయిలో ప్రకటన 02.01.2026న విడుదల కానుంది. దరఖాస్తుల స్వీకరణ 03.01.2026 నుంచి 11.01.2026 వరకు జరుగుతుంది. దరఖాస్తులు సంబంధిత జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ ద్వారా అందజేయాలి. అర్హుల ప్రాథమిక జాబితాను 19.01.2026న ప్రదర్శించనున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు 23.01.2026 నుంచి 24.01.2026 వరకు నిర్వహిస్తారు. తుది ఎంపిక జాబితాను 28.01.2026న విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులు 01.02.2026 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. విద్యార్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి అర్హతలు నిర్ణయించారు.

2025–26 Good news | ఏఎన్‌ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ అవసరం.

హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, అటెండర్, వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్ వంటి పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు తప్పనిసరి కావు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు పీజీడీసీఎం లేదా బి.ఎస్సీ, బి.కాం కంప్యూటర్స్ డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ పోస్టుకు బి.కాం లేదా బి.కాం కంప్యూటర్స్ ఉత్తీర్ణత అవసరం. వార్డెన్ పోస్టుకు ఏదైనా డిగ్రీలో కనీసం 50శాతం మార్కులు, అలాగే బి.ఎడ్ లేదా ఎం.ఏ ఎడ్యుకేషన్ అర్హత ఉండాలి. పార్ట్ టైమ్ టీచర్ పోస్టుకు బి.ఎస్సీ (మ్యాథ్స్)తో పాటు బి.ఎడ్ లేదా ఎం.ఏ ఎడ్యుకేషన్ అర్హత అవసరం. వృత్తి శిక్షణ బోధకులుగా పనిచేయాలంటే 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికేట్, టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఉండాలి. ఏఎన్‌ఎం పోస్టుకు ఇంటర్‌తో పాటు రెండేళ్ల ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు లేదా ఏఎన్‌ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ అవసరం.

2025–26 Good news
2025–26 Good news

వయోపరిమితి 01.07.2025 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. సాధారణ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 45 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 50 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు వయోసడలింపు కల్పించారు. ఎంపిక నిబంధనల్లో స్థానికతకు పెద్దపీట వేశారు. కేజీబీవీ ఉన్న మండలానికి చెందిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్థానికత నిర్ధారణకు ఆధార్ కార్డు లేదా తహశీల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. కేజీబీవీల్లో బోధనా మాధ్యమం ఇంగ్లీష్ కావడంతో, డిగ్రీ వరకు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండటం అవసరమని అధికారులు స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోస్టర్ విధానంలో అమలు చేయనున్నారు.

చిత్తూరు జిల్లాలోని టైప్ 3, టైప్ 4 కేజీబీవీల్లో కలిపి మొత్తం 29 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టైప్ 3 కేజీబీవీల్లో 19 పోస్టులు ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ 4, ఏఎన్‌ఎం 6, అసిస్టెంట్ కుక్ 4, హెడ్ కుక్ 1, స్కావెంజర్ అండ్ స్వీపర్ పోస్టులు కలిపి 4 ఉన్నాయి. టైప్ 4 కేజీబీవీల్లో మొత్తం 10 ఖాళీలున్నాయి. వీటిలో వార్డెన్ 2, పార్ట్ టైమ్ టీచర్ 3, చౌకీదార్ 2, హెడ్ కుక్ 1, అసిస్టెంట్ కుక్ 2 పోస్టులున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆసక్తి గల మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయంలో నేరుగా అందజేయాలి. పోస్టుల భర్తీకి మండలాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారని, సంబంధిత మండలానికి చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తెలిపారు.

దరఖాస్తుతో పాటు విద్యార్హత సర్టిఫికేట్లు, వయస్సు ధ్రువీకరణకు 10వ తరగతి మార్కుల జాబితా లేదా ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వంటి పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఈ నియామకాలు పూర్తిగా అవుట్‌సోర్సింగ్, తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా అలాగే చిత్తూరు జిల్లాలో నిరుద్యోగ మహిళలకు ఈ నోటిఫికేషన్ పెద్ద అవకాశంగా మారిందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

click here for more

click here to read TG ICET 2026 | Notification: Feb 12 నుంచి దరఖాస్తులు May 13,14న పరీక్ష

Leave a Reply