Charging Bicycle | రైతు వినూత్న ఆలోచన..

Charging Bicycle | రైతు వినూత్న ఆలోచన..
- చార్జింగ్ సైకిల్ తో ఎంతో మేలు!
- రైతు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కనకరాజు..
Charging Bicycle | నిజాంపేట, ఆంధ్రప్రభ : ఉరుకుల పరుగుల జీవితాల్లో మనిషికి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మానవుడు జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతులుగా ఉండాలంటే రోజూ వ్యాయామం, వాకింగ్, సైకిల్ తొక్కితే ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు సూచించడంతో రజాక్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కనకరాజు వినూత్న ఆలోచనతో రూ.25వేలతో చార్జింగ్ సైకిల్ ను కొనుగోలు చేశాడు.

ఈ సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే 45 కిలోమీటర్లు మేర ప్రయాణం చేయవచ్చని తెలిపారు. చార్జింగ్ స్కూటీలు కొనుగోలు చేసినట్లయితే ఎప్పుడు పాడవుతుందో తెలియదని, ఈ చార్జింగ్ సైకిల్ కొనుగోలు చేసినట్లయితే రెండు విధాలుగా వాడుకోవచ్చని, దీని ద్వారా మనిషి ఆరోగ్యంతో పాటు జీవనశైలి మార్చుకోవచ్చని తెలిపారు. వ్యవసాయం ఉన్న రైతుకు ఇలాంటి సైకిల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
