tanker collision | ట్యాంకర్ ఢీకొని.. యువకుడి మృతి

tanker collision | ట్యాంకర్ ఢీకొని.. యువకుడి మృతి

  • ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం
  • అనంతసాగర్ క్రాస్ రోడ్ సమీపాన ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

tanker collision | హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ… కరీంనగర్ ప్రధాన రహదారిలో హసన్ పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిచెందాడు. ఇవాళ‌ ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన చందుపట్ల విద్యాసాగర్ (22)గా గుర్తించారు. ప్రతిరోజూ విద్యాసాగర్ ఎల్కతుర్తి నుండి హనుమకొండ గోపాల్ పూర్ కి వెళ్లి పాల ప్యాకెట్ల(Milk packets)ను విక్రయిస్తుంటాడు.

అదే క్రమంలో పాల ప్యాకెట్లను తీసుకొని వెహికిల్(vehicle) పై హనుమకొండ వైపున‌కు వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ అనంతసాగర్ క్రాస్ రోడ్ వద్ద వెహికల్ ను ఢీకొట్టింది. ఈసంఘటనతో తీవ్ర గాయాలైన విద్యాసాగర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దుర్ఘటనతో రోడ్డుపై ప్యాకెట్లు పలిగి పాలతో రక్తం పారడంతో ఆ ప్రాంతమంతా హృదయ విదారక దృశ్యం నెలకొంది.

ఈసమాచారం మేరకు తండ్రి అశోక్, తల్లి శారదలు హుటాహుటిన అక్కడకు చేరుకొని తమ కుమారుడు మృతిచెందడాన్ని చూసి వారు చేసిన రోదనలు ఆ ప్రాంత ప్రజలను కన్నీరు పెట్టించింది. హసన్ పర్తి(Hassan Parthi) సీఐ చేరాలు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Leave a Reply