Revanth Reddy | కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ రానివ్వం..

Revanth Reddy | కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ రానివ్వం..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేసీఆర్ (KCR) కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వమని.. ఇదే నా శపథమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లోని కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ… డీలిమిటేషన్ లో సీట్లు పెరిగితే 100కు పైగా గెలుస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో ఓడించాం.. పంచాయతీ ఎన్నికల్లో పాతరేశామన్నారు. కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత అని సీఎం రేవంత్ అన్నారు. నేను నీకు భయపడతానా..? అన్నారు. కేసీఆర్ గాండ్రింపులకు, ఉడుత ఊపులకు భయపడబోమన్నారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమా కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
