Nizamabad | నట్టల నివారణ మందుల పంపిణీ
Nizamabad | నిజామాబాద్ జిల్లా, రెంజల్, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, మేకలు ఆరు లక్షలకు గాను 36 వేలకు మాత్రమే నట్టల నివారణ మందులు ఇచ్చినట్లు జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య స్పష్టం చేశారు. ఈ రోజు మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసే కార్యక్రమాన్ని తిరుపతి, లలిత, హనుమాన్లు,(బుజ్జి) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధరయ్య మాట్లాడుతూ… జిల్లాలో రెండు రోజుల పాటు ఆరు లక్షల 36 వేల గొర్రెలు, మేకలకు అందజేసినట్లు చెప్పారు. జిల్లాలో అన్ని మండలాల్లో నట్టల నివారణ మందులు ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 22 నుండి 31 వరకు కొనసాగుతుందని అన్నారు. మూగజీవాలకు పెంపకదారులు నట్టల నివారణ మందుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గంగాధరయ్య అన్నారు. కార్యక్రమంలో గొర్రెలు 2260, మేకలు 1698 లకు మందులు తాగించినట్లు పశు వైద్యాధికారి విట్టల్ తెలిపారు. కార్యక్రమంలో సహయ సంచాలకులు డాక్టర్ బస్వరెడ్డి, మండల టిఆర్ఎస్ నాయకుడు తిరుపతి బుజ్జి, జూనియర్ పశువైద్యాధికారులు నాగరత్నం, గంగరాజు, సిబ్బంది సావిత్రి, లక్ష్మణ్, పెంపకదారులు దేవాయి, లక్ష్మణ్, బుర్ర రవి, పెద్ద హనుమాన్లు, తదితరులు ఉన్నారు.

