Gandhari | అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా..
- యువకుడి మృతి.. ఒకరి పరిస్థితి విషమం.
- ఐదుగురికి గాయాలు..
Gandhari | గాంధారి, ఆంధ్రప్రభ : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతిచెందిన సంఘటన గాంధారి మండలంలోని నేరల్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కాయితీ తండాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు, 9 మంది ట్రాక్టర్ పైన కాయితీ తండా నుంచి చద్మల్ తండాలోని లక్ష్మమ్మ గుడికి వెళ్తుండగా, నేరల్ గ్రామ సమీపంలోని రైతు వేదిక వద్ద టాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్న మంజ గణేష్ (15) యువకుడు మృతిచెందగా, మంజ కిషన్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ట్రాక్టర్ లో ఉన్న మిగతా వారికి స్వల్పగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానాలకు తరలించారు.

