MARKET | కేసులు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులు

MARKET | కేసులు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులు

  • తూకాల్లో మోసం… బరువులో వ్యత్యాసం.
  • దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు.
  • తొమ్మిది కేసులు నమోదు, జరిమానా విధింపు.

MARKET | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : మార్కెట్లో కొనుగోలుదారులు కష్టపడి కొనుగోలు చేసుకునే నిత్యావసర సరుకుల తూకాల్లో మోసాలు , బియ్యం బస్తాలు బరువులో వ్యత్యాసాలపై విజయవాడకు చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారుల బృందం ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రంలో దాడులు నిర్వహించింది. విజిలెన్స్ అధికారులు శ్రీహరి రావు ,వెంకట్ రెడ్డి, జి ఎస్ కృష్ణ ప్రసాద్, తూనికలు కొలతల శాఖ ఉన్నతాధికారి రియాజ్ అహ్మద్ దాడులు చేశారు. దుకాణాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించగా మోసాలు బట్టబయలు అయినాయి. కొన్ని దుకాణాల్లో 25 కిలోల బియ్యం బస్తాలో 22 కిలోల బియ్యం ఉన్నట్లుగా విజిలెన్స్ బృందం గుర్తించింది. ఈ సందర్భంగా తొమ్మిది కేసులు నమోదు చేశారు. 25000 వేలు నుంచి 50000 రూపాయలు మేరకు జరిమానా విధించినారు.

Leave a Reply