2nd part trend | నందమూరి హీరోలకు సీక్వెల్ కలిసి రాలేదా

2nd part trend | నందమూరి హీరోలకు సీక్వెల్ కలిసి రాలేదా
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్ ఉంటుంది.. అదే.. సినీ ఇండస్ట్రీ జనాలకు అయితే ఈ సెంటిమెంట్ మరి కాస్త ఎక్కువే. అలాగే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా.. ఫెయిల్యూర్ వచ్చినా.. దానికి సెంటిమెంట్ ని ముడిపెట్టి చూస్తారు. సెంటిమెంట్(sentiment) ల చుట్టూ సక్సెస్ ఫెయిల్యూర్స్, సక్సెస్ ఫెయిల్యూర్స్ చుట్టూ సెంటిమెంట్స్ తిరుగుతూంటాయి. ఈ విషయంలో ఎవరు పెద్ద, ఎవరు చిన్న అని ఏం లేదు…అందరూ వాటి కోణంలోంచే చూస్తారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్(hot topic) ఏమిటంటే పార్ట్ టూ…సీక్వెల్ ల హవా గురించే…అందరూ వాటి ఆలోచనలోనే పడ్డారు…డబుల్ సక్సెస్ లు అందుకుంటున్నారు. కానీ, ఎందుకో ఈ విషయంలో నందమూరి వారు మాత్రం వెనకబడ్డారని అనుకుంటున్నారంతా. నందమూరి హీరోలకు సీక్వెల్(A sequel for Nandamuri heroes) కలిసి రాలేదా.? కలిసి రాకపోవడమూ ఒక ఇది సెంటిమెంట్ గానే మారిందా. అనే డిష్కసన్ ఇండస్ట్రీలో జరుగుతోంది.. ఇంతకీ.. నందమూరి హీరోలు చేసిన సీక్వెల్స్ ఏంటి..? ఏవి కలిసి రాలేదు? ఎందుకు కలిసి రాలేదు? ఈ టాక్ రావడానికి కారణం ఏంటి..?
2nd part trend | |ఎన్టీఆర్ మహా నాయకుడు..

నందమూరి హీరోల్లో బాలయ్య నాటి నుంచి నేటి వరకు ఎన్నో విభిన్న కథా చిత్రాలను(Different stories) అందించారు. ఆడియన్స్ ని ఎంతగానో అలరించారు. అయితే.. మహా నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్టులుగా తీసారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు. అయితే.. ఈ రెండు పార్టుల్లో ఎన్టీఆర్ కథానాయకుడు ఫరవాలేదు అనిపించింది కానీ.. ఎన్టీఆర్ మహా నాయకుడు మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయింది. ఎన్టీఆర్ బయోపిక్(NTR biopic) ను ముందుగా తేజ డైరెక్షన్ లో చేయాలి అనుకున్నారు. అయితే.. కథ విషయంలో బాలయ్యతో తేజకు విభేదాలు రావడంతో.. ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చారు. ఆతర్వాత ఈ భారీ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీక్వెల్ మూవీ నిరాశే మిగిల్చింది.
2nd part trend | నిరాశపరిచిన అఖండ 2..

అఖండ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబో అంటే.. ఆ బొమ్మ బ్లాక్ బస్టరే(bomma blockbustere) అనే ఫీలింగ్ ఆడియన్స్ లో క్రియేట్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన అఖండ అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. దీంతో అఖండ సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అఖండ 2 అంటూ ఈ భారీ సీక్వెల్ ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యింది. డిసెంబర్ 12న థియేటర్స్ లోకి(In theaters on December 12th) వచ్చింది కానీ.. ఈ క్రేజీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు.. సినిమాలను జనాలకు మరింత దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. ఈ సీక్వెల్ బయ్యర్లకు నష్టాలను మిగిలుస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు..
2nd part trend | షాక్ ఇచ్చిన వార్ 2..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. వార్ 2 అనే బాలీవుడ్ మూవీ చేశారు. ఇది సీక్వెల్ మూవీ. ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్(NTR in the first part) నటించలేదు కానీ.. వార్ సీక్వెల్ లో నటించేసరికి టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా మాంచి క్రేజ్ ఏర్పడింది. అయితే.. భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన వార్ 2 ఏమాత్రం ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.. అభిమానులు అయితే.. ఒక కాలర్ కాదు.. రెండు కాలర్లు ఎగరేయవచ్చు(Both collars can be flown) అని ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పేసరికి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ.. అనుకున్నది ఒక్కటీ.. అయ్యింది ఒక్కటీ. బాక్సాఫీస్ దగ్గర వార్ 2 బోల్తాపడింది.. దీంతో అభిమానులకే కాదు ఎన్టీఆర్ కు కూడా వార్ 2 షాక్ ఇచ్చిందని చెప్పచ్చు.
2nd part trend | దేవర 2 ఉందా..? లేదా..?

ఎన్టీఆర్, కొరటాల.. కాంబోలో రూపొందిన చిత్రం జనతా గ్యారేజ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో.. మళ్లీ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. ఈ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ(latest movie) దేవర. ఈ సినిమాకి నెగిటీవ్ టాక్ వచ్చినా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే.. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే.. రెండు పార్టులుగా చేయనున్నట్టుగా కొరటాల అనౌన్స్(Koratala Announce) చేశారు. దేవర ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో దేవర 2 లేదనే ప్రచారం జరుగుతుంది. స్వయంగా ఎన్టీఆర్ దేవర 2 ఉంటుందని చెప్పారు. అయితే.. వార్ 2 డిజాస్టర్ అవ్వడంతో.. దేవర 2 లేదని మళ్లీ ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతానికి దేవర 2 ఉందా..? లేదా…? అనేది సస్పెన్స్ గా మారింది.
2nd part trend | బింబిసార 2 ఎప్పుడు…?

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ ఎంతటి సంచలనం సాధించిందో చూశాం. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్(Biggest Blockbuster) అందించింది. దీంతో బింబిసార మూవీకి సీక్వెల్ ఉందని.. త్వరలో సెట్స్ పైకి వస్తుందని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. బింబిసార రిలీజై మూడు సంవత్సరాలు అయ్యింది కానీ.. ఇంత వరకు బింబిసార 2 ఉందో.. లేదో.. క్లారిటీ లేదు. అలాగే కళ్యాణ్ రామ్ ఇటీవల డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా టైమ్ లో కూడా డెవిల్ మూవీకి సీక్వెల్ ఉందని ప్రకటించారు. అయితే.. ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా ఎలాంటి అప్ డేట్(update) లేదు. ఇలా.. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సీక్వెల్ సినిమా చేసినా సక్సెస్ సాధించకపోవడం.. చేద్దామనుకున్న సీక్వెల్స్ ముందుకు వెళ్లకపోవడంతో.. నందమూరి హీరోలకు సీక్వెల్స్ కలిసి రాలేదేమో అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి.. ఫ్యూచర్ లో నందమూరి హీరోలు ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారేమో చూడాలి.
