School Girls | కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలి..

School Girls | కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలి..

  • ఐటీడీఏ పి ఓ

School Girls | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ పరిధిలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు అందించిన కంప్యూటర్లను సద్వినియోగం చేసుకొని విద్యలో మరింత రాణించాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. ఇవాళ‌ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాల (School) విద్యార్థినులకు ఉచిత కంప్యూటర్ల పంపిణీ కార్యక్రమానికి గ్లోబల్ ఫౌండేషన్ రాష్ట్ర సమన్వయకర్త ఎండి.సాబీర్ హుస్సేన్, ఐ టి డి ఏ ఉపసంచాలకులు అంబాజీ యాదవ్ లతో కలిసి హాజరై విద్యార్థులకు ఉచిత కంప్యూటర్లను అందజేశారు.

School Girls

ఈసందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ… గ్లోబల్ ఫౌండేషన్ (Global Foundation) సంస్థ అధినేత ఎండి. బాబర్ విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్లు అందించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు ఈ కంప్యూటర్లను సద్వినియోగం చేసుకుని సబ్జెక్టులపై మరింత అవగాహన పెంచుకోవాలని, వార్షిక ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ సి ఎం ఓ జగన్, ఏ టి డి ఓ సదానందం, ఉట్నూర్ మండల విద్యాధికారి ఆశన్న, పాఠశాల ప్రిన్సిపల్ మాణిక్ రావు, గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply