Jana Sena Party activist | అండగా ఉంటాం..

Jana Sena Party activist | అండగా ఉంటాం..
- మృతుని కుటుంబానికి భరోసా
Jana Sena Party activist | కోడూరు: కోడూరు మండలం పిట్టల్లంక శివారు బడేవారిపాలెంలో జనసేన పార్టీ కార్యకర్త బడే పిచ్చేశ్వరరావు ఇటీవల కరెంట్ షాకుతో మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ శుక్రవారం పరామర్శించారు. పిచ్చేశ్వరరావు ఆకస్మిక మృతికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పిచ్చేశ్వరరావు కుమారులు గోపి, నవీన్లకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఆయన వెంట జనసేన మండల అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ మర్రె గంగయ్య, టీసీ అధ్యక్షుడు చుండూరు నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, శివాలయం మాజీ చైర్మన్ బడే పిచ్చియ్య, కూటమి నాయకులు పూతబోయిన సీతారత్న సాయిబాబు, తోట రాంబాబు, గాదె భాస్కరరావు, బండ్రెడ్డి హరి, బడే హనుమంతరావు, తోట లక్ష్మణ్, తోట రాజేష్, కడవకొల్లు రాజేష్, కుక్కు మల్లి, గోళ్ళ కొండయ్య, మత్తి సుబ్బారావు తదితరులున్నారు.
