Same | కాలంతోబాటు ధర్మం కూడా..

Same | కాలంతోబాటు ధర్మం కూడా..

ఆంధ్ర‌ప్ర‌భ : ధర్మాచరణకు అవసరమనది ”ధృతి” అంటే ధైర్యం, నిష్ట, పట్టుదల. కాలానుగుణంగా మనం మారాలి.. ధర్మాలను మార్చుకోవాలి.. ఇది సాధారణ వ్యక్తుల భావన. దానికి సమర్ధనగా వారు.. ఒకనాడు వ్రాసిన వ్రాతలు లేదా చేసిన బోధలు తరువాతి కాలానికి పనికి వస్తాయా? రావు కదా.. అలాగే ధర్మమూ కాలానుగుణంగా మారాలనేది వారి భావన. అయితే.. ఆనాటికీ ఈనాటికీ సూర్యుడు తూర్పుననే ఉదయిస్తున్నాడు.. పడమటనే అస్తమిస్తున్నాడు. ఆయన గమనమూ అలాగే ఉన్నది. నిప్పు వేడిగానే ఉన్నది. చంద్రుని వెన్నెల చల్లగానే ఉన్నది. చెట్లు ప్రాణవాయువును, పండ్లను ఇస్తున్నాయి. భూమి పంటను ఇస్తున్నది. ఇవేవీ మారనప్పుడు మారిందేమిటి? స్వార్థపూరితమైన మానవుల మనసు. భోగలాలసతపై ఆసక్తి పెరిగిన వ్యక్తులు, మనసు ధర్మాచరణ నుండి మినహాయింపు పొందేందుకై కాలం మారుతుంది..

Same | బలహీనతలలో కెల్ల పెద్ద బలహీనత

తదనుగుణమైన ధర్మమూ మారాలని చెపుతుంటారు. ఆసక్తి కలిగిన భోగాలు కానీ, వాటిని సాధించేందుకు ఎన్నుకున్న మార్గం కానీ, విధానం కానీ.. ధర్మానికి విరుద్ధమైనవని తెలిసినప్పుడు తమ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి, తమ వాదనను సమర్ధించుకోవడానికి కాలం మారుతున్నదని తదనుగుణంగా ధర్మం మారాలని వాదిస్తుంటారు. వ్యక్తుల బలహీనతలలో కెల్ల పెద్ద బలహీనత తమ బలహీనతలను అంగీకరించక పోవడమే. బలహీనతలను అంగీకరిస్తే.. బలహీనతలను బలంగా మార్చుకునే అవకాశం ఉంటుందని గుర్తించకపోవడమే.

రామాయణంలో రావణుడు సీతను అపహరించి అశోకవనంలో దాచాడు. ఆమెను బెదిరించో, ప్రలోభపెట్టో తనదారికి తెచ్చుకోవాలని భావించాడు. స్త్రీ అనుమతి లేకుండా ఆమె పొందును కోరడం, అపహరించడం లేదా బెదిరించడం ధర్మ సమ్మతం కాదు. అయినా.. ”స్వధర్మో రాక్షసాం భీరు సర్వథైవ నసంశయ: గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్యవా”.. ఓ భయస్వభావురాలా! (సీతా) పరస్త్రీలను అపహరించడం, పొందడమూ రాక్షసులకు అన్ని విధాలుగా స్వధర్మమే… సంశయంలేదని అంటాడు సుందరకాండలో. పరస్త్రీలను చెరబట్టడం, అనుభవించడం రాక్షసజాతికి ధర్మమే.. నీపై మనసుపడింది, ఎత్తుకొచ్చాను, బంధించాను. నేను రాక్షసుడను కాబట్టి నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను అంటున్నాడు.

Same | ధర్మమార్గాన్ని తప్పి

Same
Same

అయితే స్వధర్మము అంటే ఏమిటి? కర్తవ్య నిర్వహణలో ప్రలోభాల చేత గాని, భయం చేతగాని కర్తవ్యానికి దూరం కాకపోవడం స్వధర్మం.. రావణుడు.. రాక్షసనీతిని, ధర్మాన్ని సరిగ్గా అనుసరిస్తున్నానని అంటున్నాడు. నిజానికి రావణుడు చతుర్ముఖ బ్రహ్మ వంశానికి చెందిన విశ్రవసు బ్రహ్మ కుమారుడు. రాక్షసుడు కానటువంటి రావణుడికి తాను చేసేది అధర్మమని తెలియదా? తెలిసినా దానిపై ముసుగు కప్పి, సత్యాన్ని గుర్తించకుండా, భోగేఛ్ఛతో చరించడం రావణుని ప్రవృత్తి. ఇలాంటి వ్రవృత్తి దేశకాలాదులతో సంబంధంలేకుండా.. నిగూఢంగా మానవులను నడిపిస్తున్నది. ధర్మమార్గాన్ని తప్పి భోగాలను కాంక్షించడం, అనుభవించడం జరుగుతుంది.

Same | మనిషి మాత్రమే

భోగేఛ్ఛ ధర్మమా, అధర్మమా అనేది ప్రక్కన పెడితే.. కాలముకానీ, ధర్మము కానీ ఎప్పుడు మారదు.. మనిషి మాత్రమే మారుతాడు. ధర్మార్థకామాలలో ధర్మాన్ని విడిచి ఎండమావుల వెంటబడినట్లుగా అర్థకామాల వెంట పడతాడు.. నిజానికి భోగాలను అనుభవించడానికి ఏ శరీరమైతే ఉపకరణంగా ఉన్నదో వృద్ధాప్యం మీదపడగానే అదే శరీరం మాత్రం భోగాలను అంగీకరించేందుకు సన్నద్ధంగా ఉండదు. మనసుకు భోగేఛ్ఛ ఉన్నా, దేశకాల పరిస్థితులతో సంబంధం లేకుండా నాకా భోగాలను స్వీకరించే ఓపికలేదని శరీరం మొండికేస్తుంది. చెరువులో నీరైపోయాక అదెలాగైతే చెరువుగా పిలవబడదో.. అలాగే వయసయి పోయాక కామ వికారాదులూ నిలవవు. సంపదలు హారతయ్యాక పరివారమూ నిలవదు.
ధర్మాచరణకు ధృతికావాలి.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు చినిగిన చొక్క వేసుకున్నా, భోజనం లేకున్నా ప్రలోభాలకు లొంగలేదు, ధర్మనిష్టకు దూరం కాలేదు. అలాంటి ధృతిమంతుల దృష్టిలో ధర్మం కాలానుగుణంగా మారదు.. అది సర్వజనీనమై, సర్వకాలికమైనదిగా నిలుస్తుంది. బలహీన మనస్కులే కాలానుగుణంగా ధర్మం మారాలనుకుంటారు.

-పాలకుర్తి రామమూర్తి

click here to read ఉచ్ఛిష్ట దోషము

click here for more

భోగేఛ్ఛ ధర్మమా, అధర్మమా అనేది ప్రక్కన పెడితే.. కాలముకానీ, ధర్మము కానీ ఎప్పుడు మారదు.. మనిషి మాత్రమే మారుతాడు. ధర్మార్థకామాలలో ధర్మాన్ని విడిచి ఎండమావుల వెంటబడినట్లుగా అర్థకామాల వెంట పడతాడు.. నిజానికి భోగాలను అనుభవించడానికి ఏ శరీరమైతే ఉపకరణంగా ఉన్నదో వృద్ధాప్యం మీదపడగానే అదే శరీరం మాత్రం భోగాలను అంగీకరించేందుకు సన్నద్ధంగా ఉండదు. మనసుకు భోగేఛ్ఛ ఉన్నా, దేశకాల పరిస్థితులతో సంబంధం లేకుండా నాకా భోగాలను స్వీకరించే ఓపికలేదని శరీరం మొండికేస్తుంది. చెరువులో నీరైపోయాక అదెలాగైతే చెరువుగా పిలవబడదో.. అలాగే వయసయి పోయాక కామ వికారాదులూ నిలవవు. సంపదలు హారతయ్యాక పరివారమూ నిలవదు.
ధర్మాచరణకు ధృతికావాలి.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు చినిగిన చొక్క వేసుకున్నా, భోజనం లేకున్నా ప్రలోభాలకు లొంగలేదు, ధర్మనిష్టకు దూరం కాలేదు.

అలాంటి ధృతిమంతుల దృష్టిలో ధర్మం కాలానుగుణంగా మారదు.. అది సర్వజనీనమై, సర్వకాలికమైనదిగా నిలుస్తుంది. బలహీన మనస్కులే కాలానుగుణంగా ధర్మం మారాలనుకుంటారు.భోగేఛ్ఛ ధర్మమా, అధర్మమా అనేది ప్రక్కన పెడితే.. కాలముకానీ, ధర్మము కానీ ఎప్పుడు మారదు.. మనిషి మాత్రమే మారుతాడు. ధర్మార్థకామాలలో ధర్మాన్ని విడిచి ఎండమావుల వెంటబడినట్లుగా అర్థకామాల వెంట పడతాడు.. నిజానికి భోగాలను అనుభవించడానికి ఏ శరీరమైతే ఉపకరణంగా ఉన్నదో వృద్ధాప్యం మీదపడగానే అదే శరీరం మాత్రం భోగాలను అంగీకరించేందుకు సన్నద్ధంగా ఉండదు. మనసుకు భోగేఛ్ఛ ఉన్నా, దేశకాల పరిస్థితులతో సంబంధం లేకుండా నాకా భోగాలను స్వీకరించే ఓపికలేదని శరీరం మొండికేస్తుంది. చెరువులో నీరైపోయాక అదెలాగైతే చెరువుగా పిలవబడదో.. అలాగే వయసయి పోయాక కామ వికారాదులూ నిలవవు. సంపదలు హారతయ్యాక పరివారమూ నిలవదు.


ధర్మాచరణకు ధృతికావాలి.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు చినిగిన చొక్క వేసుకున్నా, భోజనం లేకున్నా ప్రలోభాలకు లొంగలేదు, ధర్మనిష్టకు దూరం కాలేదు. అలాంటి ధృతిమంతుల దృష్టిలో ధర్మం కాలానుగుణంగా మారదు.. అది సర్వజనీనమై, సర్వకాలికమైనదిగా నిలుస్తుంది. బలహీన మనస్కులే కాలానుగుణంగా ధర్మం మారాలనుకుంటారు.భోగేఛ్ఛ ధర్మమా, అధర్మమా అనేది ప్రక్కన పెడితే.. కాలముకానీ, ధర్మము కానీ ఎప్పుడు మారదు.. మనిషి మాత్రమే మారుతాడు. ధర్మార్థకామాలలో ధర్మాన్ని విడిచి ఎండమావుల వెంటబడినట్లుగా అర్థకామాల వెంట పడతాడు.. నిజానికి భోగాలను అనుభవించడానికి ఏ శరీరమైతే ఉపకరణంగా ఉన్నదో వృద్ధాప్యం మీదపడగానే అదే శరీరం మాత్రం భోగాలను అంగీకరించేందుకు సన్నద్ధంగా ఉండదు. మనసుకు భోగేఛ్ఛ ఉన్నా, దేశకాల పరిస్థితులతో సంబంధం

Leave a Reply