Aditya 999 బాలయ్యతో గీతా ఆర్ట్స్ మూవీ..?
Aditya 999 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నందమూరి బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్(Blockbusters) సాధిస్తూ కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్నారు. ఇటీవల అఖండ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. డిసెంబర్ 5న రావాల్సిన అఖండ 2 డిసెంబర్ 12న థియేటర్స్(Theaters) లోకి వచ్చింది. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. బాలయ్యతో గీతా ఆర్ట్స్ సినిమా అనేది మరోసారి వార్తల్లోకి నిలిచింది. మరి.. నిజంగానే బాలయ్యతో గీతా ఆర్ట్స్ సినిమా ఉంటుందా..?
Aditya 999 ఎన్.బీ.కే 111..


బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో భారీ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలయ్యకు జంటగా నయనతార నటించనుంది. బాలయ్య, మలినేని గోపీచంద్.. ఈ ఇద్దరి కాంబోలో వీరసింహారెడ్డి అనే సినిమా రూపొందింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాని ఎన్.బీ.కే 111(NBK 111) అనే వర్కింగ్ టైటిల్(working title) తో పట్టాలెక్కిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు నిర్మించనున్నారు. హిస్టారికల్ కథకు భారీ యాక్షన్‌ను జోడించి ఓ వినూత్నమైన ఎపిక్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు ఎన్నడూ చూడని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో బాలయ్య కనిపించనున్నారని సమాచారం.
Aditya 999 ఆదిత్య 999..

బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999(Aditya 999). ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఎప్పుడో స్టోరీ రెడీ చేశారు. ఈ కథకు బాలయ్య ఎప్పుడో ఓకే చెప్పారు. అయితే.. బాలయ్య వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన ఇన్ని రోజులు కుదరలేదు. అయితే.. ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాలి అనుకున్నారు. ఆతర్వాత బాలయ్య తనే ఈ మూవీని డైరెక్ట్ చేస్తానన్నారు. ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు, బాలయ్య.. ఈ ఇద్దరూ కాకుండా ఈ మూవీని తెరకెక్కించే బాధ్యతను క్రిష్ చేతిలో పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్(Pre-Production Work) జరుగుతుంది. మలినేని గోపీచంద్ తో చేస్తున్న మూవీ పూర్తైన తర్వాత ఆదిత్య 999 సెట్స్ పైకి రానుంది. ఈ క్రేజీ మూవీతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ బలంగా వినిపిస్తోంది.
Aditya 999 |గీతా ఆర్ట్స్ లో..

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్(Successful Movies) అందించింది. అయితే.. ఈమధ్య కాలంలో భారీ చిత్రాల నిర్మాణానికి కాస్త దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ భారీ చిత్రాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని తెలిసింది. అందులో భాగంగానే.. నట సింహం నందమూరి బాలయ్యతో సినిమా చేయనుందని టాక్. బాలయ్యతో ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటుంది కానీ.. ఇంత వరకు సెట్ కాలేదు. అలాగే బోయపాటితో కూడా గీతా ఆర్ట్స్ సినిమా(Geetha Arts Cinema) చేయాలి. సరైనోడు సినిమా తర్వాత నుంచి గీతా ఆర్ట్స్ లో బోయపాటి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈసారి బాలయ్య, బోయపాటి కాంబో మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుందని.. 2027లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్(Crazy Project Sets) పైకి వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

CLICK HERE TO READ అవతార్ గురించి జక్కన్న..

click here to read 20th Century | ‘అవతార్’ కు సుకుమార్ ప్రశంసలు

