Govt | యూరియా.. అందించండయ్యా!

Govt | యూరియా.. అందించండయ్యా!
- రైతుల వేడుకోలు
- ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆగ్రహం
Govt | నిజాంపేట, ఆంధ్రప్రభ : వర్షాకాలం వేసిన పంటలకు సకాలంలో యూరియా అందించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని, అయినా ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టుగా కూడా లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు గాను ప్రభుత్వం(Govt) రైతులకు సకాలంలో యూరియా అందిస్తుందని అధికారులు చెప్పిన మాటను పెడచెవిన పెడుతున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.
నిజాంపేట మండల కేంద్రంలో రైతులు సొసైటీ, వర్ష ట్రేడర్స్(Varsha Traders) వద్ద పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం క్యూలైన్ లో నిలబడ్డారు. సరిపడా యూరియా అందించడంలో అధికారులు, నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రైతులకు యూరియా అందించలేకపోయారని, యాసంగి పంటలకైనా ముందస్తు చర్యలు తీసుకొని యూరియా అందించడంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి రైతులకు సకాలంలో యూరియా అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
