Selfie Point | ఓటేసి..సెల్ఫీ

Selfie Point | ఓటేసి..సెల్ఫీ

Selfie Point | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి: ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటి చెప్పడంలో భాగంగా వరంగల్ జిల్లా యంత్రాంగం(District Administration) పంచాయతీ ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. బుధవారం మూడవ విడత జరిగిన ఎన్నికల సందర్భంగా జిల్లాలోని నాలుగు మండలాల్లో 8 చోట్ల గ్రీన్ పోలింగ్(green polling) కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.

పోలింగ్ కేంద్రం వద్ద పచ్చని తోరణాలతో, బంతిపూల దండలతో స్వాగత ద్వారాలు కట్టారు. ముగ్గులతో పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. హరిత పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ పాయింట్(Selfie Point)లను కూడా ఏర్పాటు చేశారు. నర్సంపేట మండలం లక్నేపల్లిలోని హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసిన తర్వాత సెల్ఫీ పాయింట్ వద్ద మహిళ ఓటరు సెల్ఫీ దిగారు.

Leave a Reply